Site icon NTV Telugu

Team India: బార్బడోస్లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు.. (వీడియో)

Team India

Team India

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్స్‌ కోసం టీమిండియా బార్బడోస్‌లో అడుగుపెట్టింది. (ANI) X ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో.. భారత జట్టులోని సభ్యులు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి పలువురు విమానాశ్రయం నుండి వారి బస్‌ ఎక్కేందుకు వెళ్తుండటం చూడొచ్చు. జట్టు సభ్యులతో పాటు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపించారు.

Read Also: Bhaje Vaayu Vegam OTT: ఓటిటిలోకి వచ్చేసిన “భజే వాయు వేగం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

రేపు.. ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. శనివారం జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు టైటిల్ సాధించాలనే కసితో ఉన్నాయి. పదేళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన భారత్‌ రెండో కప్పు గెలవాలని, చరిత్ర తిరగరాయాలనే కసితో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మొట్ట మొదటి ఐసీసీ వరల్డ్‌ కప్‌ గెలిచి రికార్డ్ క్రియేట్ చేయడానికి ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఒక్క మ్యాచ్ ఓడకుండానే ఫైనల్ వరకు చేరాయి.

Read Also: Kakani Govardhan Reddy: ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. వారికి అండగా ఉంటాం..!

Exit mobile version