Site icon NTV Telugu

IND vs WEST INDIES: వెస్టిండీస్తో జరిగిన 3వ వన్డేలో భారత్ రికార్డు.. ఎందుకో తెలుసా..!

Cricket

Cricket

వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. భారత్ సిరీస్ ను దక్కించుకుంది. అంతేకాకుండా రికార్డు నెలకొల్పింది. మొదటి వన్డేలో భారత్ గెలవగా.. రెండవ వన్డేలో వెస్టిండీస్ గెలిచింది. చివరి వన్డేలో ఇరుజట్లు.. సిరీస్ కోసం పోటీపడగా అది ఇండియా వశమైంది. అంతేకాకుండా వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్ లో ఓడి ఘోర పరాభవాన్ని ఎదురుచూసింది.

Baby Movie: బేబీ టీంపై సంచలన ఆరోపణలు.. ఇక నోరు మూసుకుంటానంటూ డైరెక్టర్ ట్వీట్!

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా వెస్టిండీస్‌పై ఇండియా అతిపెద్ద విజయం సాధించింది. గతంలో ఇంగ్లండ్‌ 186 పరుగుల విజయలక్ష్యంతో రికార్డు సృష్టించగా.. తాజాగా 200 పరుగుల తేడాతో ఇండియా రికార్డు సాధించింది. అయితే ఇండియా తరుఫున ఓపెనర్లు.. భారీ స్కోరు చేసినందుకు ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నారు. గిల్, ఇషాన్ కలిసి 143 పరుగులు చేశారు. ఈ స్కోరు వెస్టిండీస్ పై భారత్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Online Trading: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. ముఠా గుట్టురట్టు

అంతేకాకుండా.. ఇంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఉండేవాడు. ఒకే మ్యాచ్ లో 7 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు సెహ్వాగ్ తర్వాత మూడో వన్డేలో.. 5 సిక్సర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా నిలిచాడు. మూడో వన్డేలో భారత్ 351 పరుగులు చేయగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టీమిండియా 350 ప్లస్ స్కోరు నమోదు చేయడం ఇది నాలుగోసారి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇంకా ODI మ్యాచ్ లు ఆడేందుకు ఉన్నాయి. మరో రికార్డు ఏంటంటే.. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌ గా ఇషాన్ నిలిచాడు. చివరిసారిగా 2020లో శ్రేయాస్ అయ్యర్ ఇలాంటి ఫీట్ చేశాడు.

Exit mobile version