NTV Telugu Site icon

IND vs NZ: రికార్డు సృష్టించిన న్యూజిలాండ్.. భారత గడ్డపై తొలిసారి

Team India

Team India

టామ్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పుణెలో శనివారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య 69 ఏళ్లుగా టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ న్యూజిలాండ్ పూణె టెస్టు మూడో రోజున న్యూజిలాండ్.. భారత్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే..

Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్‌పై దాడితో పోలిక..

స్వదేశంలో టీమిండియా ప్రతిష్ట దెబ్బతింది. 12 ఏళ్ల తర్వాత భారత్‌ స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిని చవిచూసింది. 1955లో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగగా.. ఇరు దేశాల 69 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా ఓవరాల్‌ రికార్డు అద్భుతంగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు తమ మధ్య 64 టెస్టులు ఆడగా.. అందులో భారత్ 22 గెలిచింది. న్యూజిలాండ్ 15 టెస్టుల్లో విజయం సాధించింది. 28 డ్రాగా ముగిశాయి. అయితే ప్రస్తుత సిరీస్‌లో రోహిత్ సేన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

IND vs NZ 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి.. సిరీస్ పాయే

శనివారం తొలి సెషన్‌లో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. 198/5తో ఉదయం ప్రారంభించిన న్యూజిలాండ్.. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యశస్వి జైస్వాల్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అంతేకాకుండా.. అర్ధ సెంచరీ కూడా చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా (42) రాణించినప్పటికీ.. అప్పటికే భారత్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. లంచ్ విరామం వరకు భారత్ ఒక వికెట్‌కు 81 పరుగులు చేసినప్పటికీ.. రెండవ సెషన్‌లో కివీస్ జట్టు ఆధిపత్యం చెలాయించింది. న్యూజిలాండ్ బౌలర్లు ప్రమాదకరంగా బౌలింగ్ చేసి.. టీమిండియా బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. దీంతో.. టీమిండియా స్వదేశంలో సిరీస్‌ను కోల్పోయింది.