Site icon NTV Telugu

IND vs SA: రెండో టెస్ట్కు సిద్ధమవుతున్న టీమిండియా.. విజయావకాశాలు ఆ జట్టుకే ఎక్కువ..!

Ind Vs Sa

Ind Vs Sa

కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టీమిండియా కసరత్తు ప్రారంభించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్ట్ లో విజయం సాధించాలనే ఉద్దేశంతో టీమ్ రంగంలోకి దిగనుంది. ఇదిలా ఉంటే.. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో భారత్‌ రికార్డు బాగోలేదు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలవలేదు.

Read Also: Viral Video: ఓ పిల్లవాడు పులితో షికారు ఎలా చేస్తున్నాడో చూడండి..! వీడియో వైరల్

కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ సమయంలో టీమిండియా 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. కాగా రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కేప్ టౌన్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్ లో భారత్ సవాల్ చేయడం అంత సులువు కాదు. టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ లాంటి గొప్ప ఆటగాళ్లున్నప్పటికీ.. గత మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి అవుటయ్యాడు.

Read Also: GVL Narasimha Rao: ప్రధాని రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు..

1993లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత 1997లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 282 పరుగుల తేడాతో ఓటమి చెందింది. 2007లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2011లో ఆడిన మ్యాచ్ కూడా డ్రా అయింది. ఆ తర్వాత 2018, 2022లో ఆడిన మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి ఈ జట్ల మధ్య పోటీ నెలకొంది.

Exit mobile version