Site icon NTV Telugu

Ind vs WI: టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా

Indvswi

Indvswi

బార్బడోస్‌ వేదికగా టీమిండియాతో జరుతున్న సెకండ్ వన్డేలో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందని విండీస్‌ సారథి షాయీ హోప్‌ అంచనా వేశారు. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బౌలింగ్‌లో రాణించి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాలని విండీస్ సారథి భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. రోమన్‌ పావెల్‌, డ్రేక్స్‌ స్థానంలో అల్జారీ జోసెఫ్‌, కార్టీ తుది టీమ్ లోకి వచ్చినట్లు వెల్లడించాడు. రెండో వన్డేలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి లేకుండానే భారత జట్టు బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టాడు. రోహిత్‌, కోహ్లీ స్థానాల్లో సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చినట్లు పాండ్యా వెల్లడించాడు.

Read Also: ALERT: కరోనా ఇంకాపోలేదు.. ఇండోనేషియాలో బయటపడిన వేరియంట్..!

కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో తొలి సిరీస్‌లో విండీస్‌తో తలపడ్డ రోహిత్‌ సేన 1-0తో ట్రోఫీ నెగ్గింది. మలి టెస్టులోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించగా వర్షం అంతరాయం కలిగించడంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో జూలై 27న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగ్గా.. ఆ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో భారత జట్టు ఉంది. ఇక బార్బడోస్‌లో తొలి వన్డేలో టీమ్ లో స్థానం దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్‌కు సెకండ్ వన్డే మ్యాచ్ లో ఛాన్స్ దక్కింది.

Read Also: Ashes series: స్టీవ్ స్మిత్ రనౌట్ పై వివాదం.. ఏంటి సర్ అది నాటౌట్ హా..

తుది జట్లు:
టీమిండియా: శుబ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్( వికెట్ కీపర్), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలీక్ అథనాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, కీసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యాన్నిక్ కరియా, గుడకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్.

Exit mobile version