వరల్డ్ కప్ 2023లో టీమిండియా విజయాల జోరును చూపించింది. ఆడిన అన్నీ మ్యాచ్ ల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. అయితే ఇప్పుడు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే టోర్నీ టైటిల్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఎక్కువగా కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లతో చర్చించాడు. అంతేకాకుండా.. జట్టు సహచరుల ప్రాక్టీస్ ను దగ్గరుండి పరిశీలించాడు.
Read Also: World Cup Final 2023: ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చే అతిరథ మహారథులు వీళ్లే..!
మరోవైపు స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీ కోసం భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా ఆస్ట్రేలియాపై గెలిచి టైటిల్ ను గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ లకు టీమిండియాకు అభిమానులు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో ఫైనల్ లో కూడా మరింత సపోర్ట్ చేసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.
Read Also: Akhil Akkineni: అజ్ఞాతంలో అయ్యగారు.. ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు
ఈ నెల 19న(ఆదివారం) భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంతకుముందు.. 2003 వరల్డ్ కప్ లోనూ టీమిండియా, ఆసీస్ ఫైనల్లో తలపడగా… ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే ఇప్పుడు సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. చూడాలి మరీ ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచి విశ్వవిజేతగా ఉంటుందో…..