NTV Telugu Site icon

IND vs SL Final: ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి

Ind Won

Ind Won

IND vs SL Final: 2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్‌ 8వ సారి ఆసియా కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. శుభ్‌మన్ గిల్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా.. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. గిల్ 6 ఫోర్లు బాదగా, ఇషాన్ మూడు ఫోర్లు బాదాడు.

Read Also: IND vs SL Final: ఆసియా కప్ గెలిచిన భారత్.. ట్విటర్లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. భారత్‌పై ప్రత్యర్థి జట్టులో ఇదే అత్యల్ప స్కోరు. భారత్ తరఫున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. భారత ఫాస్ట్ బౌలర్ల ధాటికి 9 మంది శ్రీలంక ఆటగాళ్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. కుశాల్ మెండిస్ 17, దుషన్ హేమంత 13 మాత్రమే రెండంకెల స్కోరును తాకగలిగారు. కాగా.. పాతుమ్ నిస్సాంక 02, కుసల్ పెరీరా 0, సదీర సమరవిక్రమ 0, చరిత్ అసలంక 0, ధనంజయ్ డిసిల్వా 04, దసున్ షనక 0, దునిత్ వెల్లలాగే 08, ప్రమోద్ మధుషన్ 01 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు.

Read Also: Ambati Rambabu: ముఖ్యమంత్రి జగన్పై నోరు పారేసుకునే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నావా..?

ఫైనల్ మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్ ముందు శ్రీలంక బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక మొత్తం 10 వికెట్లను భారత ఫాస్ట్ బౌలర్లే పడగొట్టారు. ఆసియా కప్ చరిత్రలో ఫాస్ట్ బౌలర్లు మొత్తం 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి. భారత్ తరఫున మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశారు.