NTV Telugu Site icon

IND vs ENG: రికార్డు సృష్టించిన టీమిండియా ఆల్ రౌండర్..

Jaddu

Jaddu

ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రవీంద్ర జడేజా రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. జాకబ్ బెథెల్‌ను అవుట్ చేయడం ద్వారా జడేజా మూడు వికెట్లు తీశాడు. దీంతో.. భారత్ vs ఇంగ్లాండ్ వన్డేల్లో తన వికెట్ల సంఖ్యను 42కి పెంచాడు.

Read Also: Laila : బూతే బూతు కానీ నవ్వుల ట్రీట్.. లైలా ట్రైలర్ చూశారా?

ప్రస్తుతం జేమ్స్ ఆండర్సన్ 31 వన్డే మ్యాచ్‌లలో 40 వికెట్లతో రికార్డును కలిగి ఉన్నాడు. అయితే జడేజా తన 27వ వన్డేలో మూడు వికెట్లు తీసి ఈ జాబితాలో అతన్ని అధిగమించాడు. భారత్ vs ఇంగ్లాండ్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్ (37), హర్భజన్ సింగ్ (36), జవగల్ శ్రీనాథ్ (35) టాప్ 5లో ఉన్నారు. జడేజా ఎకానమీ 4.69 మరియు స్ట్రైక్ రేట్ 29.7గా ఉంది.

Read Also: Karnataka: పుట్టింటికి వెళ్లిన భార్య.. సంతోషంతో ఆటో డ్రైవర్ ఏం చేశాడో చూడండి…

మరోవైపు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. తొలి వన్డేలో మూడో వికెట్‌ తీసిన వెంటనే ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్ జడేజా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 1 మెయిడిన్ ఓవర్‌తో కేవలం 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.