Site icon NTV Telugu

IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

Team India Test

Team India Test

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కాగా.. 462 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఈరోజు 3 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. దీంతో.. భారత్ 106 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ (150), పంత్ (99) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగుల పట్టికను పరుగులు పెట్టించారు. అయితే.. ఒక్క పరుగు తేడాతో పంత్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టగానే టీమిండియా బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. అయితే.. న్యూజిలాండ్ విజయానికి 107 పరుగులు అవసరం.. ఈ రన్స్ కొట్టకుండా రోహిత్ సేన ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

Read Also: Indian Railways: రైల్వేలో సిబ్బంది కొరత.. రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్(35), రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లీ (70), సర్ఫరాజ్ ఖాన్ (10), రిషబ్ పంత్ (99), కేఎల్ రాహుల్ (12), జడేజా (5), అశ్విన్ (15), కుల్దీప్ యాదవ్ (6), సిరాజ్, బుమ్రా డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, విలియం ఓ రూర్కే చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత.. అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ సంపాదించారు.

Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఎల్‌జీ ఆమోదం..

ఇదిలా ఉంటే.. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 4 బంతులు వేసిన తర్వాత బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. దీంతో.. ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి రేపు ఆట ప్రారంభం కానుంది. కాగా.. ఆటకు రేపు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ చేధిస్తే గెలుస్తుంది.. లేదంటే 107 పరుగుల లోపు భారత్ బౌలర్లు ఆలౌట్ చేస్తే టీమిండియా గెలుపొందుతుంది. అలా కాకుండా.. 107 పరుగుల లోపు కట్టడి చేస్తే మ్యాచ్ డ్రా అవుతుంది. చూడాలి మరి రోహిత్ సేన ఎలా ప్రదర్శిస్తారో…

Exit mobile version