NTV Telugu Site icon

Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇలా..

Teaminida

Teaminida

Team India Schedule 2025: భారత క్రికెట్ జట్టు 2024లో అభిమానులను ఎంతగానో థ్రిల్ చేసింది. ఈ ఏడాది టీమిండియాకు కాస్త మిశ్రమ సంవత్సరం అని చెప్పవచ్చు. ఒకవైపు భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు, తొలిసారిగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇకపోతే, 2025లో కూడా టీమిండియా చాలా బిజీగా ఉండబోతోంది. 2025 చాలా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే. 2025 సంవత్సరంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు మొత్తం 2 ICC ట్రోఫీలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచ్‌తో భారత జట్టు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం చివరి మ్యాచ్ జనవరి 3 నుండి 7 మధ్య సిడ్నీలో జరుగుతుంది. దీని తర్వాత, వైట్ బాల్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత 12 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని గెలవాలనే ఉద్దేశంతో ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో ఆడనుంది. ఇక 2025 లో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

Also Read: The KING is dead: ది కింగ్ ఈజ్ డెడ్.. కోహ్లీపై ఆర్సీబీ మాజీ కోచ్ విమర్శలు..

జనవరి-ఫిబ్రవరి: ఇంగ్లండ్ భారత పర్యటన (జనవరి 22 నుండి ఫిబ్రవరి 12 వరకు)

భారత్ vs ఇంగ్లండ్ T20I సిరీస్ (5 T20Iలు) యొక్క పూర్తి షెడ్యూల్ ఇలా..

1వ టి20: 22 జనవరి 2025, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా.
2వ టి20:: 25 జనవరి 2025, MA చిదంబరం స్టేడియం, చెన్నై.
3వ టి20: 28 జనవరి 2025, రాజకోట్
3వ టి20: 31 జనవరి 2025, పూణె.
5వ టి20: 2 ఫిబ్రవరి 2025, వాంఖడే స్టేడియం, ముంబై.

భారత్ vs ఇంగ్లండ్ ODI సిరీస్ (3 ODIలు) పూర్తి షెడ్యూల్..
1వ ODI : 6 ఫిబ్రవరి 2025, విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్
2వ ODI: 9 ఫిబ్రవరి 2025, బారాబతి స్టేడియం, కటక్
3వ ODI: 12 జనవరి 2025, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

ఫిబ్రవరి–మార్చి: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (19 ఫిబ్రవరి – 9 మార్చి 2025)

20 ఫిబ్రవరి – ఇండియా vs బంగ్లాదేశ్ – దుబాయ్
23 ఫిబ్రవరి – ఇండియా vs పాకిస్థాన్ – దుబాయ్
2 మార్చి – ఇండియా vs న్యూజిలాండ్ – దుబాయ్
మార్చి 4 – ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ – దుబాయ్ (క్వాలిఫై అయితే)
మార్చి 9 – ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ – దుబాయ్ (అర్హత సాధిస్తే)

మార్చి-మే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 (14 మార్చి – 25 మే 2025).

జూన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్: 11-15 జూన్ 2025 – లండన్ (అర్హత సాధిస్తే).

Also Read: Puspa 2 Collections: తగ్గేదేలే.. కొనసాగుతున్న పుష్ప కలెక్షన్ల రికార్డుల పరంపర..

జూన్-ఆగస్టు: ఇంగ్లండ్‌లో భారత పర్యటన (జూన్ 20-ఆగస్టు 4)..

తొలి టెస్టు: జూన్ 20-24, హెడింగ్లీ, లీడ్స్
రెండో టెస్టు: జూలై 2-6, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
మూడో టెస్టు: జూలై 10-14, లార్డ్స్, లండన్
నాలుగో టెస్టు : 23-27 జూలై, మాంచెస్టర్
ఐదవ టెస్ట్: 31 జూలై-4 ఆగస్టు, ది ఓవల్.

ఇప్పటి వరకు ఈ మ్యాచ్ ల వివరాలను వెల్లడించారు. ఇవే కాకుండా.. షెడ్యూల్‌ ప్రకారం, టీమిండియా 2025 లో బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కాకపోతే ఆ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల అవ్వలేదు.

Show comments