Site icon NTV Telugu

Andhra Pradesh Crime: వీడు ఉపాధ్యాయుడేనా..? స్కూల్‌ నుంచి విద్యార్థిని కిడ్నాప్‌, తాళికట్టి అత్యాచారం..!

Minor Girl Raped

Minor Girl Raped

Andhra Pradesh Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. పాఠాలు నేర్పాల్సిన గురువు.. ప్రేమ పాఠాలు బోధించాడు.. తాను ప్రేమిస్తున్నాను అని నమ్మబలికాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్‌ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు పెళ్లి అయిపోయింది.. అంటూ ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.. ఊహించని పరిణామంతో షాక్‌ తిన్న ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పంది.. ఆ తర్వాత వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..

Read Also: Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం.. మళ్లీ నిలిచిపోయిన పనులు

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.. విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన స్థానంలో ఉన్న అతడి కన్ను ఓ విద్యార్థినిపై పడింది.. 15 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు.. అంతేకాదు.. స్కూల్‌ నుంచి ఈ నెల 19వ తేదీన విద్యార్థినిని తన బైక్‌పై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లాడు.. అక్కడే ఆ బాలికకు తాళి కట్టి పెళ్లైందని చెప్పాడు.. అంతటితో ఆగకుండా.. తనలోని పశువును నిద్రలేపాడు.. తాళికట్టి పెళ్లి అయిపోయిందని చెప్పి.. ఆపై ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్. మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారని ఆకివీడు సీఐ కె సత్యనారాయణ వివరించారు.

Exit mobile version