ఏపీలో ఉపాధ్యాయులపై సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్సతో ముగిసిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడారు. రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులపట్ల అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం ఉపాధ్యాయులకు ఉన్న హక్కు. అభ్యర్ధులు ఎవరైనా వారి తరుపున పోటీ చేస్తే నామినేషన్ పత్రాల్లో ఉపాధ్యాయులు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ నామినేషన్ లో ఉపాధ్యాయులు పాల్గొనే వెసులుబాటును రాజ్యాంగం కల్పించిందన్నారు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
ఈ విషయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నామినేషన్ పత్రాల్లో సంతకాలు పెట్టారని షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటి ? మంత్రి బొత్స దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లామన్నారు చిరంజీవి. రాజకీయ పరమైన అంశాలను అధికారులే ఉపాధ్యాయుల మధ్యకు తీసుకురావడం సరికాదన్నారు. సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థులకు సక్రమంగా పుస్తకాలు అందలేదని మంత్రికి చెప్పాం అన్నారు. వచ్చే ఏడాది నుంచి రెండు సెమిస్టర్లు మాత్రమే అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి తెలిపారు.
Read Also: Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడి తయారీ విధానం