Site icon NTV Telugu

MLC ELECTIONS : ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు

Election

Election

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలలోపు క్యూ లైన్ లో ఉన్న వారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా క్యూ లైన్లో ఉన్నవారు.. కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలీస్ భద్రత నడుమ సరూర్ నగర్ స్టేడియంకు బ్యాలెట్ బ్యాక్స్ లు తరలించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ భద్రత మధ్య సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ నెల 16 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Also Read : Corporater: అంచెలంచెలుగా ఎదిగాడు.. ఆఖరికి కుక్క చావు చచ్చాడు

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్లు ఉదయం నుంచి క్యూ లైన్లో నిల్చోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంది. హైదరాబాద్ లో మొత్తం 25 బూత్ లతో పాటు 139 పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. దీంతో పోలింగ్ ముగిసిన వెంటనే భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బ్యాక్సులను సరూర్ నగర్ లోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. దీంతో ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 16వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

Also Read : Today(13-03-23) Stock Market Roundup: ‘సిలికాన్‌’ ప్రభావం.. ఈ ఏడాది కనిష్టానికి పతనం..

Exit mobile version