NTV Telugu Site icon

Sad News: హోంవర్క్‌ చేయలేదని విద్యార్థిని కొట్టిన టీచర్‌.. చికిత్స పొందుతూ మృతి !

Student

Student

Sad News: హైదరాబాద్‌లోని రామంతపూర్‌ వివేకనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని రామంతపూర్ వివేక్ నగర్‌లో కృష్ణవేణి టాలెంట్ స్కూలులో యూకేజీ చదువుతున్న విద్యార్థి హేమంత్ మృతి చెందాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలకతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడని హేమంత్ తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలుడు ఇవాళ ప్రాణాలు కోల్పోయినట్లు వారు చెప్పారు.

Also Read: Rahul Gandhi: స్వర్ణ దేవాలయంలో గిన్నెలు శుభ్రం చేసిన రాహుల్

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, బంధువులు స్కూల్‌ ముందు విద్యార్థి మృతదేహంతో ధర్నా చేపట్టారు. అనంతరం మృతదేహన్ని అంత్యక్రియలు కోసం వనపర్తికి తరలించారు. గతం వారం రోజుల నుంచి హేమంత్ జ్వరంతో ఇబ్బంది పడ్డాడని ఉప్పల్ పోలీసులు తెలిపారు. అయితే హేమంత్ జ్వరంతో మృతి చెందాడనే కోణంలో ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు.