నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. శ్రీ కీర్తన స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రాకను తల్లి చూస్తుండగానే ఆమె కళ్ల ముందే బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. శ్రీ కీర్తన హైస్కూల్ లో చిన్నారి హరి ప్రియ యూకేజీ చదువుతోంది. స్కూల్ ముగిసిన అనంతరం బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.