Site icon NTV Telugu

Teacher Kidnap: క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌..

Kidnap

Kidnap

Teacher Kidnap: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారు. క్లాస్‌రూమ్‌లో ఉండగానే దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు. పోలీసులే కిడ్నాప్ చేసారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడవసారి అని కుటుంబ సభ్యులు అంటున్నారు. కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక రూ.20 కోట్లు విలువ చేసే భూవివాదంలో కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.

Read Also: Alcohol: మందు తాగేటప్పుడు వీటిని అస్సలు తినొద్దు..

భూవివాదంపై మునీర్ అహ్మద్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. భూమిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోందని.. వెల్దుర్తి పీఎస్‌లో బాధితుని భార్య ఫిర్యాదు చేశారు. మునీర్ అహ్మద్ సోదరుడు, రిటైర్డ్ ఎస్బీఐ అధికారి మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version