Site icon NTV Telugu

Tragedy: చాయ్‌పత్తా అనుకుని పురుగుల మందుతో టీ.. వృద్ధ దంపతులు మృతి

Tea Powder

Tea Powder

Tragedy: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. టీ తాగిన వెలుచూరి గోవింద్ ( 75 ) , అప్పాయమ్మ ( 70 ) అనే వృద్ధ దంపతులు మృతి చెందారు. కోతి  పురుగుల మందు ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతుల ఇంటి ముందు పడేసింది.  అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పురుగుల మందు ప్యాకెట్‌ను టీ పొడి ప్యాకెట్‌గా భావించి టీ పెట్టుకొని వృద్ధ దంపతులు తాగారు. కొద్దిసేపటికి నోటి నుంచి నురగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Read Also: Crime News: ఆస్తి కోసం.. బావమరిదిని హత్య చేసిన బావ! చివరకు

 

Exit mobile version