Site icon NTV Telugu

AP Crime: తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య..

Crime

Crime

AP Crime: అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడు లో దారుణం చోటు చేసుకుంది. ఇంటిపై నిద్రిస్తున్న లాలు భాష (23)అనే టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. తాడిపత్రి నందలపాడు లో మెకానిక్ షాపులో పనిచేస్తున్న లాలు భాష అనే యువకుడు.. తన ఇంటి పై నిద్రిస్తూ ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.. లాలు భాష గతంలో కొన్ని కేసులలో నిందితుడుగా ఉన్నారు. పాత కక్షలు కారణంగా హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు, పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుని తండ్రి మహబూబ్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగియగానే కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని హింసాత్మక ఘటలు జరిగాయి.. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు ఇరు పార్టీల నేతలు చెబున్న విషయం విదితమే.. అయితే, లాలు భాష హత్యకు కారణం ఏంటి? రాజకీయ వైరమా? వ్యక్తిగత పంచాయతీ అనేది మాత్రం తెలాల్సి ఉంది.

Read Also: Ponnam Prabhakar: ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..

Exit mobile version