Site icon NTV Telugu

Kondapalli Municipal Election: ఎక్స్ అఫిషియో ఓటు ఓకే.. కొండపల్లి చైర్మన్ పీఠం టీడీపీదే!

Kondapalli Municipal Election

Kondapalli Municipal Election

ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ సొంతమైంది. ఒక ఓటు తేడాతో చైర్మన్ పీఠంను టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి 16 ఓట్లు రాగా.. వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. కొండపల్లి మున్సిపల్ చైర్మెన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మెన్‌గా ఇండిపెండెంట్‌గా గెలిచి.. టీడీపీకి మద్దతు ఇచ్చిన శ్రీదేవి ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Also Read: RK Beach: పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు మృతి!

కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్‌లో మొత్తం 29 సీట్లు ఉన్నాయి. అందులో 14 వైసీపీ, 14 టీడీపీ గెలవగా.. ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన శ్రీదేవి.. టీడీపీకి మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీ బలం 15కి పెరిగింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి ఓటు వేయటంతో వైసీపీ ఓట్లు 15కు చేరాయి. ఇక కీలకంగా మారిన అప్పటి ఎంపీ కేశినేని నాని తన ఓటును టీడీపీకి వేయటంతో వైసీపీ కోర్టుకు వెళ్లింది. 2021లో వేసిన అప్పటి ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు చెల్లుతుందని హైకోర్టు అనుమతి ఇస్తూ.. సీల్డ్ కవర్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ నాని ఓటుతో టీడీపీ బలం 16కి చేరటంతో.. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ టీడీపీ పరమైంది.

Exit mobile version