NTV Telugu Site icon

Kesineni Nani: త్వరలో టీడీపీ ఆఫీసుకి తాళం.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..

Kesineni

Kesineni

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తంగిరాల సౌమ్యది బలహీన నాయకత్వం.. తెలుగుదేశం పార్టీ నందిగామలో భూస్థాపితం అవుతుందన్నారు. ఇంగీత జ్ఞానం లేని సౌమ్య, నాపై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తే, తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడటం ఏంటని.. ఒక ఇంటర్వ్యూలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కేశినేని నాని తీవ్రంగా ఖండించారు.

Read Also: Viral : గర్ల్‌ఫ్రెండ్‌కి నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్‌ని బహుమతిగా ఇచ్చాడు.. కానీ..!

అయితే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్వరలో తాళం వేసి.. ఆయన హైదరాబాద్ కు జంప్ అవుతారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చెప్పుకొచ్చారు. అలాగే, బీజేపీలో తెలుగుదేశాన్ని కూడా విలీనం చేస్తారన్నారు. బీజేపీ, చంద్రబాబును నమ్మదు.. టీడీపీ- జనసేన విడుదల చేసిన మేనిఫెస్టో అంత మోసపూరితంగా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతి ఎన్నికల బూతు నుంచి అధిక మెజార్టీతో వైసీపీని గెలిపించాలి.. తెలుగుదేశం త్వరలో మూతపడుతుంది.. నందిగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది స్వర్గీయ దేవినేని వెంకటరమణ అదే అడుగు జాడల్లో మొండితోక బ్రదర్స్ కొనసాగిస్తున్నారు.. దేవినేని ఉమా చచ్చిన పాము.. రాజకీయ బిక్ష పెట్టిన దేవినేని ఉమకు సీటు ఇవ్వకపోతే.. కనీసం పరామర్శించడానికి తంగిరాల సౌమ్య రాకపోవడం విశ్వాసఘాతకం అని కేశినేని నాని మండిపడ్డారు.