NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: టీడీపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది

Sajjala

Sajjala

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2019 జూలై 29 న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు టీడీపీ మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవులు అసెంబ్లీలో మాట్లాడి మద్దతు ఇచ్చారని తెలిపారు. అప్పుడు తెలుగు దేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చిందని.. ఇప్పుడు జనాన్ని భయ బ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఇంత కంటే నీచులు ఎవరైనా ఉంటారా ? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై దిగజారి మాట్లాడుతోందన్నారు. అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురాడాన్ని ప్రశంసించిందన్నారు. అధికారంలోకి వస్తే టీడీపీ రద్దు చేస్తా అంటుందని.. దీనిపై టీడీపీ వివరణ ఇవ్వాలన్నారు. తెలుగు దేశం ప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర బీజేపీ యూనిట్ పని చేస్తుందన్నారు.

READ MORE: Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..

అయితే.. రాష్ట్రంలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండగా టైటిల్ యాక్ట్ అంశం తెరపైకి వచ్చింది. ఈ యాక్ట్ ను ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకుంటున్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా కూటమి అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రతి సభలో ఈ యాక్టు్ గురించి మాట్లాడుతున్నారు. ఈ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇటీవల ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ ఈ అంశంపై విచారణ చేయాలని సీఐడీకి సూచించింది. విచారణ చేసిన సీఐడీ ఈసీకి నివేదిక పంపింది.