ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2019 జూలై 29 న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు టీడీపీ మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవులు అసెంబ్లీలో మాట్లాడి మద్దతు ఇచ్చారని తెలిపారు.