NTV Telugu Site icon

Srinivas Reddy: రాష్ట్రంలో అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది: శ్రీనివాసరెడ్డి

Srinivas Reddy

Srinivas Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పరిస్థితులను ప్రభుత్వం గాడిలో పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే అని, నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

‘రాష్ట్రంలో అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్, విద్యార్థుల మీటింగ్ ఒక పండగ వాతావరణంలో జరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే. నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారు. అంజాద్ బాషా పరిస్థితి ఏందో నగర ప్రజలకు అందరికి తెలుసు’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు.

‘అంజాద్ బాషాను చూసి కాదు, నన్ను చూసి ఓట్లు వేయండి అని వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చెప్పారు. కడపలో త్రాగునీటి సమస్య ఉందో లేదో మాతో వస్తావా? మేము నిరూపిస్తాం. అంజాద్ బాషా చేసిన అవినీతి అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కాంట్రాక్టులో 8% కమిషన్ తీసుకున్నారు. అంజాద్ బాషా ఇదే విధంగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. మినిష్టర్ కాలనీ వల్ల ఏంతో మంది మోసపోయారు. అంజాద్ బాషా ఒక భేవకూఫ్. గతంలో నువ్వు మాట్లాడిన మాటలకు వేరే వాళ్లు ఉంటే అంజాద్ బాషాను అయన తమ్ముడు అహ్మద్ బాషను దున్నపోతు మీద ఊరేగింపు చేసేవారు. ప్రజా సమస్యలు మాట్లాడానికి మా ప్రభుత్వం గళం విప్పుతుంది. అవినీతి గురించి ఇంకొకసారి మాట్లాడితే మా నాయకులు ఊరికే ఉండరు’ అని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Show comments