NTV Telugu Site icon

Kolikapudi Srinivasa Rao: ప్రచారంలో జోరు పెంచిన కొలికపూడి..

Kolikapudi

Kolikapudi

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊటుకూరు గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఆయన శ్రీ వీరాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, రైతులు ట్రాక్టర్లతో, యువత బైక్ లతో, మహిళలు మంగళ హారతులతో పూలమాలతో ఘన స్వాగతం పలుకుతూ జై టీడీపీ, జై జై టీడీపీ అంటూ కోలికపూడి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ.. ప్రతి వీధి, ప్రతి వాడ, అంతా పసుపు జెండాలతో నిండిపోయింది.

Read Also: MS Dhoni GoldenDuck: ఎంఎస్ ధోని గోల్డెన్ డక్‌.. ప్రీతి జింటా సంబరాలు..!

ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ముందుకు సాగారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేస్తాను మీ అమూల్యమైన ఓటును పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)కి, శాసనసభ సభ్యుడిగా కొలికపూడి శ్రీనివాసరావు అను నాకు ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కొలికపూడి శ్రీనివాసరావు అభ్యర్థించారు.