NTV Telugu Site icon

Kolikapudi Srinivasa Rao: భవిష్యత్త్ బాగుండాలంటే.. కూటమి అభ్యర్థులను గెలిపించాలి..!

Kolikapudi

Kolikapudi

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ఏడవ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. మీ సమస్యలను త్వరలోనే నేను పరిష్కరిస్తానంటూ ప్రజలకు మాటిస్తూ ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. మీరంతా టీడీపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను తీరుస్తానంటూ ప్రజలకు కొలికపూడి శ్రీనివాసరావు మాట ఇస్తున్నారు.

Read Also: Manish Sisodia : మనీష్ సిసోడియాకు గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే 10 రోజుల్లో మీ అందరు కష్టపడి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా, పరిపాలనపరంగా మళ్లీ గాడిలో పెట్టగలిగిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం మనకి ఉంది అన్నారు. వచ్చే పది రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రజలంతా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిలోని అభ్యర్థులకు ఓటు వేయాలని కొలికపూడి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.