NTV Telugu Site icon

Balakrishna: జగన్ మాటల మాంత్రికుడు..

Balakrishna

Balakrishna

కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు దగ్గర నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార సభలో టీజీ వెంకటేష్, టీజీ భరత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్ మాటల మాంత్రికుడు.. మాట తప్పనని రాష్ట్రాన్ని మంటగలిపేసాడు.. జగన్ జలగలా పీడిస్తున్నాడు.. దళితులకు అండగా ఉంటానని దళితుల ఛావులతో మంటలార్పుతున్నాడు.. నయవంచకుడు జగన్.. అప్పుల్లో, ఆత్మహత్యల్లో దేశంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపాడు అని ఆయన తెలిపారు. జగన్ దుర్మార్గానికి, మోసాలకు, దగా కి అంతులేదు.. శిశుపాలుని తప్పులు వంద దాటినట్లు జగన్ తప్పులు మించిపోయాయి.. మాస్క్ అడిగితే దళిత వైద్యున్ని వేధించాడు.. రాష్ట్రానికి అండ, దండ టీడీపీ జెండా.. చెల్లిని, తల్లిని తరిమేసాడు జగన్.. బాబాయ్ ని చంపించిన నిందితులను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేసారు.. రాయలసీమలో టీడీపీ, సెగలు, పగలను చల్లార్చింది.. ఓటును దుర్వినియోగం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అవుతుంది అని బాలకృష్ణ అన్నారు.

Read Also: Revanth Reddy: ఆగస్ట్ 15 లోపు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం..

కూటమి అధికారంలోకి వస్తే అందరికి న్యాయం చేస్తాం అని బాలకృష్ణ తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణకు ఆమోదముద్ర వేస్తామన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు తీసే ప్రసక్తి లేదు.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. జె బ్రాండ్ మద్యంతో కోట్లు దోపిడీ చేస్తున్నారు.. ఇసుక దోపిడీ చేస్తున్నారు.. పొరపాటున జగన్ కి ఓటు వేస్తే ఇంకా ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేస్తాడు.. జగన్ ఆటలు సాగవు.. జగన్ పొగరు నడుం విరిచి సమయం ఆసన్నమైంది.. ఎన్నికల సునామీ రాబోతుంది….వైసీపీ ని ఓడించాలి.. వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తాం…జవాబుదారీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి..
మళ్లీ వైసీపీ వస్తే ధరలు, పన్నులు ఇంకా పెంచుతారు అని ఆయన పేర్కొన్నారు. కోడికత్తి, గొడ్డలితో అధికారంలోకి వచ్చారు.. జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే దోచుకొని దాచుకోవడమే.. జగన్ దగ్గర దుష్టచతుష్టయం వున్నారు..వాళ్ళ సలహాలు మాత్రమే వింటారని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

Read Also: Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

కూటమి కలయిక పాశుపతాస్త్రం.. రాష్ట్రం పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.. అభివృద్ధి కోసం బీజేపీ అవసరం ఉంది.. జగన్ ను ఇంటికి తరిమే వరకు గుండె మంట ఆరకూడదన్నారు. తెలుగువారి రాజకీయ చైతన్యం బూడిదలో పోసిన పన్నీరైందా.. భూమి పాసుపుస్తకాల్లో ఫోటో వేసుకొని తాకట్టు పెట్టి అప్పుచేస్తారు జాగ్రత్త.. అతను సైకో, మూర్ఖుడు అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.