Site icon NTV Telugu

Mahanadu 2025: కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు.. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సీఎం చంద్రబాబు!

Mahanadu 2025 Cm

Mahanadu 2025 Cm

కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణంలో తన పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ప్రాంగణంలో మహానాడు కిట్టును సీఎం కొనుగోలు చేశారు. ఆపై ఫొటో ప్రదర్శనను తిలకించారు. మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రక్తదాన శిబిరాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

Also Read: Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

మహానాడు ప్రాంగణంలోని ప్రతినిధుల వేదిక వద్దకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. మహానాడు ఏర్పాట్లపై కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డిని సీఎం అభినందించారు. మహానాడు వేదిక పైనుంచి కార్యకర్తలకు అభివాదం చేశారు. మహానాడు కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. మహానాడును ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగిస్తున్నారు. పహల్గాం దాడిలో మృతులకు, సింధూర్ ఆపరేషన్లో మృతి చెందిన సైనికులకు మహానాడు నివాళి అర్పించింది.

Exit mobile version