NTV Telugu Site icon

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు..

Cm Jagan

Cm Jagan

CM Jagan: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు ఫ్యాన్ పార్టీలోకి భారీగా వస్తున్నారు. తాజాగా,
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన డాక్టర్‌ కంచర్ల అచ్యుతరావు చేరారు. ఆయనకు కండువా కప్పిలోకి పార్టీలోకి సీఎం ఆహ్వనించారు. కాగా, ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. అయితే, ప్రస్తుతం సేవా కార్యక్రమాలను అచ్యుతరావు నిర్వహిస్తున్నారు. ఇక, ఆరిలోవ ప్రాంతంలో స్థానికంగా మంచి పట్టున్న నేతగా అచ్యుతరావుకు గుర్తింపు ఉంది.

Read Also: Narne Nithin: ఆయ్.. ఎన్టీఆర్ బామ్మర్ది ఈసారి కూడా హిట్ కొట్టేటట్టు ఉన్నాడే

అలాగే, సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావుతో పాటు ఆయన సతీమణి సంధ్యా రాణి కూడా జాయిన్ అయ్యారు. వీరికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్‌ ఎలక్షన్‌ ఇంచార్జీగా కూడా రామచంద్ర రావు పని చేసిన అనుభవం ఉంది.

Show comments