ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు ఫ్యాన్ పార్టీలోకి భారీగా వస్తున్నారు. తాజాగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు చేరారు.