Site icon NTV Telugu

MLC Elections Fake Votes: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై మరోసారి ఈసీకి టీడీపీ ఫిర్యాదు

Rajappa

Rajappa

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఈసీకి వరుసగా కంప్లైంట్లు చేస్తూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేసింది టీడీపీ. పులివెందుల్లో అధికార వైసీపీ బూత్ల క్యాప్చరింగ్ చేసిందంటూ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. సీఎం నియోజకవర్గం పులివెందుల్లోనే బూత్ కాప్చరింగ్ చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలు దొంగ ఓట్లు వేయించేందుకు రోడ్ల పై పడ్డారు.తప్పులు వారు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.పులివెందుల్లో జరిగింది చాలా దారుణం.టీడీపీ అభ్యర్దులు విజయం సాధించేందుకు సిద్దంగా వున్నారు.పులివెందుల బూత్ నంబర్ 80లో బూత్ క్యాప్చరింగ్ చేశారు.. మరో చోట పోలింగ్ ఆపారు.

Read Also: Today(13-03-23) Stock Market Roundup: ‘సిలికాన్‌’ ప్రభావం.. ఈ ఏడాది కనిష్టానికి పతనం..

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ అక్రమాలపై మండిపడ్డారు. 12 గంటల వరకు బోగస్ ఓట్లు అయ్యాక మధ్యాహ్నం నుంచి వివిధ బూత్ లను క్యాప్చర్ చేశారు. తిరుపతిలో 229 బూత్ లో పోలింగ్ ఆపారు.పులివెందుల్లో బీటెక్ రవి బూత్ క్యాప్చరింగ్ పై ప్రశ్నిస్తే దాడి చేశారు.అయన కారుపా దాడి చేశారు.అనంతపురంలో వైసీపీ నేతలు ఆటో డ్రైవర్లతో ఓట్లు వేయిస్తున్నారు.టీడీపీ, వామపక్షాల అభ్యర్థులపై దాడులకు గురైతే వారిపైనే కేసులు పెడుతున్నారు. బోగస్ ఓట్ల వున్న ప్రతి చోట రీ-పోలింగ్ పెట్టాలి. వైసీపీకి ప్రజలు మద్దతు ఉన్నది అనుకుంటే ఎందుకు ఈ అరాచకాలు..? ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో అక్కడ రీ-పొలింగ్ కోరుతున్నాం అన్నారు.

Read Also: Amit Shah: ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక రోజు.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అమిత్ షా శుభాకాంక్షలు

Exit mobile version