NTV Telugu Site icon

Vangalapudi Anitha: మంత్రి రోజాకు వంగలపూడి అనిత ఓపెన్ ఛాలెంజ్!

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha Slams Minister Roja: వైసీపీ మంత్రి రోజాకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దమ్ముంటే ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా రోజా ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని వంగలపూడి అనిత విమర్శించారు. మంత్రి రోజా అవినీతిని నగరి వైసీపీ నేతలే కథలు కథలుగా చెబుతున్నారన్నారు. జగనన్న బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంటుందని అనిత ఎద్దేవా చేశారు.

టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖలో మాట్లాడుతూ… ‘రోజాను నగరి పొమ్మంటోంది.. జబర్ధస్త్ రమ్మంటోంది. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయి. మంత్రి రోజా అవినీతిని నగరి వైసీపీ నేతలే కథలు కథలుగా చెబుతున్నారు. చైర్ పర్సన్ పదవి కోసం రోజా తన బినామీలతో 40 లక్షలు తీసుకున్నారు. నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. దమ్ముంటే ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా రోజా ప్రమాణం చేయాలి’ అని అన్నారు.

Also Read: Fighter Review: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రివ్యూ!

‘నారా చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిలలను నాన్ లోకల్ అంటున్నారు. వైసీపీ నేతలకు పాదయాత్ర చేసినప్పుడు షర్మిల నాన్ లోకల్ కాదా?.. సమాధానం చెప్పాలి. షర్మిల ప్రశ్నలకు సీఎం వైఎస్ జగన్ సమాధానాలు చెప్పాల్సి ఉంది. జగనన్న బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంటుంది. వై-నాట్ 175 నుంచి.. సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి సీఎం జగన్ దిగిపోయారు’ అని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Show comments