Thikka Reddy: మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం అభివృద్ధి చేశారు..? అంటూ మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనారెడ్డిని నిలదీశారు.. టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. రాజీకాయాలు హీటెక్కుతున్నాయి.. మరోవైపు.. నేతలు అప్పుడే జోరుగా ప్రచారంలోకి దిగిపోయారు.. గవిగట్టుగ్రామంలో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది టీడీపీ.. ఆ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read Also: Kotamreddy Sridhar Reddy: పది రూపాయలు ఇచ్చి వంద లాక్కుంటున్నారు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..!
ఇసుక వ్యాపారం, పంచాయితీలు, భూ దందాలు, అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ సంపాదనపై పడ్డారు తప్ప.. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఫైర్ అయ్యారు తిక్కారెడ్డి.. ఇక, ఇసుక వ్యాపారం కారణంగా నియోజకవర్గంలోని రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని ధ్వజమెత్తారు.. వచ్చే ఎన్నికల్లో బాలనాగిరెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి. కాగా, ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే తమ టార్గెట్ అంటోంది వైసీపీ.. ఇదే సమయంలో.. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే.. ఇక, ఏపీని కాపాడే నాథుడే ఉండడంటూ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ సారి వైసీపీ ఓడించి తీరుతాం అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.