NTV Telugu Site icon

Kuna Ravi Kumar: బీసీలు బాగుపడితే.. సీఎం జగన్‌కు కడుపు మంట: రవికుమార్

Kuna Ravi Kumar

Kuna Ravi Kumar

రాష్ట్రంలో బీసీలు బాగుపడితే సీఎం వైఎస్ జగన్‌కు కడుపు మంట అని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోందిని.. దళితులను, బీసీలను అవమానించే యాత్ర జరుగుతుందన్నారు. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారని రవికుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో పేరుకే బీసీ మంత్రులు ఉన్నా పెత్తనం అంతా రెడ్లదే అని పేర్కొన్నారు.

శ్రీకాకుళంలో కూన రవికుమార్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో సీఎం జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది‌. దళితులను , బీసీలను అవమానించే యాత్ర జరుగుతుంది. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారు. ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని, గౌతు శిరీష, పంచుమర్తి అనురాధలు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు. బీసీ మహిళలను అవమానించి రోతపుట్టించే రాతలు రాయించి.. నా బీసీలు అని మాట్లాడటానికి సిగ్గుందా?. పేరుకే బీసీ మంత్రులు.. పెత్తనం అంతా రెడ్లదే?. జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు. బొత్స, ధర్మాన, సీదిరి, తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు’ అని అన్నారు.

Also Read: TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!

‘మా హయాంలో 74 మంది బీసీలు, దళితులు 28 మంది ఉన్నారు. రజక, యాదవ, నాయిబ్రాహ్మన, మత్స్యకార, గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం. టీటీడీ చైర్మెన్లుగా బీసీలకు పెద్ద పీట వేసింది టీడీపీనే. వైసీపీ రెడ్డిలను మాత్రమే టీటీడీ చైర్మెన్ చేసింది. అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలకు బీసీలు అశపడాలా?. ధర్మాన, బొత్స, తమ్మినేని నిజమైన బీసీలు కాదు. ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు. 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది వీసీలు రెడ్లేనా?. బీసీలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబుపై కుట్ర చేసి అక్రమ కేసులు పెట్టారు‌. బీసీలు బాగుపడితే జగన్‌కు కడుపు మంట. బీసీల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు’ అని రవికుమార్ పేర్కొన్నారు.