Kanna Laxminarayana: రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అభిప్రాయపడ్డారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. ముఖ్యమంత్రి పదవితో రాష్ట్రాన్ని ఎలా దొచుకోవచ్చు అని వైఎస్ జగన్ నిరూపించారు.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి 45 వేల కోట్లు దోచుకున్నాడు.. పదహారు నెలలు జైల్లో ఉండి రాష్ట్రాన్ని ఎలా దొచేయాలి అనే ప్లాన్ వేశాడు.. అధికారం అడ్డుపెట్టుకుని ల్యాండ్, సాండ్ మైన్, వైన్ ల పేరు తో మూడున్నర లక్షల కోట్లు దోచేశారు అని సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Tula Uma: బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా.. తుల ఉమ సీరియస్ వార్నింగ్..
ఇక, ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో చెబుతూ త్వరలో పుస్తకం విడుదల చేస్తాం అని ప్రకటించారు కన్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , అమరావతిని నిర్వీర్యం చేశారు, పెండింగ్ ప్రాజెక్ట్స్ అటకెక్కించారు.. ఉద్యోగులను మోసం చేశారు.. రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టాడు, మళ్ళీ అధికారం ఇస్తే ఏ బ్రిటిష్ వాళ్లకు తకట్టు పెడతాడో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నాసిరకం సారాయికి కేంద్రంగా చేశారు.. నకిలీ మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని తెలిపారు. నవరత్నాల పేరుతో కొన్ని డబ్బులు ఇచ్చి పన్నులు రూపంలో ప్రజలను దోచేస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు లక్షా పద్నాలుగు వేల కోట్లు అక్రమ మార్గంలో వాడుకున్నారు.. అందుకే రాష్ట్ర ప్రజలు జగన్ ను వద్దనుకుంటున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.