Site icon NTV Telugu

Ganta Srinivas: తన రాజీనామా ఆమోదంపై హైకోర్టు మెట్లెక్కిన గంటా శ్రీనివాస్..

Ganta

Ganta

తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై గంటా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ గంటా పిటిషన్ వేశారు. అంతేకాకుండా.. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాస్ పిటిషన్ ఈనెల 29న విచారణకు రానుంది.

GVL: ఆర్కే బీచ్ రోడ్డులో రిప్లబిక్ ఫ్రీడమ్ కలర్ వాక్

కాగా.. సోమవారం గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు మూడేళ్ల కిందట తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత రాజీనామాను ఆమోదించారు స్పీకర్. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే, ఈనెల 22న ఆ రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ జనరల్ డాక్టర్ పీపీకే రామాచార్యులు ప్రకటించారు.

YCP: ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జి మరోసారి మార్పు..

2021 ఫిబ్రవరి 12వ తేదీన విశాఖలోని కూర్మనపాలెం గేట్‌ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు.. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు విన్నవించారు. అయితే, ఆ రాజీనామాపై నిర్ణయాన్ని ఇంత కాలం పెండింగ్‌లో ఉంచిన స్పీకర్‌.. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదించింది. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు.. టీడీపీ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Exit mobile version