NTV Telugu Site icon

Buddha Venkanna: దమ్ముంటే రండి.. మీరో మేమో చూసుకుందాం..!

Buddha Venkanna

Buddha Venkanna

Buddha Venkanna: దమ్ముంటే రండి.. మీరో మేమో చూసుకుందాం.. అంటూ సవాల్‌ చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడ వెస్ట్ సెగ్మెంట్లో బల ప్రదర్శన నిర్వహించిన ఆయన.. వెస్ట్‌ టికెట్‌ టీడీపీకి కేటాయించి.. తనకు టిక్కెట్ ఇవ్వాలని దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.. తన అనుచరులతో ర్యాలీ చేశారు.. విజయవాడ పశ్చిమం కాకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా కేటాయించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు.. అయితే, చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు బుద్దా వెంకన్న.. ఇక, ర్యాలీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టికెట్‌ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నాకు దైవ సమానులు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చాను. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

Read Also: Kethireddy Venkatarami Reddy: గుంతలు పూడ్చడం కాదు.. టెండర్లు ఇప్పిస్తా రోడ్డు పూర్తి చేయి..!

ఇక, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాను అని ప్రకటించారు బుద్దా వెంకన్న.. సీటు రాలేదని మా పార్టీ వాళ్లెవరైనా సరే చంద్రబాబును విమర్శిస్తే తాట తీస్తాను అని వార్నింగ్‌ ఇచ్చారు. నాకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ ఇద్దర్నీ కోరుతున్నాను. ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నాను. ఎన్నికల్లో నిలబడటానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కేశినేని నానికి బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చాను.. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని మండిపడ్డారు. నేను అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే భారీగా కార్యకర్తలు వచ్చారని తెలిపారు. చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ గురించి చెడుగా మాట్లాడితే తాట తీస్తాను అని హెచ్చరించారు. దమ్ముంటే రండి.. మీరో మేమో చూసుకుందాం.. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలని సూచించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.