Site icon NTV Telugu

Bonda Uma: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది

Bonda Uma

Bonda Uma

ఏపీలో ఇవాళ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అనేక చోట్ల అధికార పార్టీ అండదండలతో బోగస్ ఓట్లు పోలయ్యాయి. పదో తరగతి పాసైనవారు గ్రాడ్యుయేట్లుగా చలామణి అవుతూ ఓటేశారు. ఇవాళ జరిగిన ఎన్నికలపై టీడీపీ మండిపడింది. ఈసీకి మరోసారి కంప్లైంట్ కూడా చేసింది. బోగస్ ఓట్ల బాగోతంపై హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తాం అన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. తిరుపతి ఎస్పీ అండతోనే దొంగ ఓటర్లు రెచ్చిపోయారు.తప్పు చేసిన అధికారులకు శిక్షపడక తప్పదు.

Read Also:Honey Bee Attack : ఎమ్మెల్యే పై తేనేటీగల దాడి.. తప్పించుకున్న రాజయ్య

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది.ఎమ్మెల్సీల గెలుపు కోసం ఇంతలా దిగజారిన ఘటనలు గతంలో లేవు.అక్రమాలు అరికట్ట లేనప్పుడు, ఇక ఎన్నికల అధికారులెందుకు..?తిరుపతిలో రౌడీ మూకలు ఇష్టారీతిన దొంగ ఓట్లు వేసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎందుకు..?జగన్ ప్రభుత్వంలో ఐదో తరగతి చదువుకున్న వాళ్ళు కూడా పట్టభద్రులయ్యారు.ఆధారాలతో సహా బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.వై నాట్ 175 ప్రణాళిక ఇదేనా..?లోకేషుని పాదయాత్ర సైట్లో ఉండనివ్వకుండా నోటీసులు మీద నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికి ఎలా మినహాయింపు ఇచ్చింది..? అన్నారు బోండా ఉమా.

Read Also: Honey Bee Attack : ఎమ్మెల్యే పై తేనేటీగల దాడి.. తప్పించుకున్న రాజయ్య

Exit mobile version