NTV Telugu Site icon

Bode Prasad: టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా కృషి చేయాలి..

Bode Prasad

Bode Prasad

Bode Prasad: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ బోడే ప్రసాద్.. నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ – జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన కష్టపడి పనిచేయాలి.. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.. ముందుకు సాగాలి అన్నారు. టీడీపీ-జనసేన మధ్య చిన్న లోపాలు ఉన్నా.. ఇతర పార్టీల వారు వాటిని ఆగాదాలుగా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. వాటిని లెక్క చేయకుండా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ మిత్రపక్షంగా ఏర్పడి ఇచ్చిన పిలు మేరకు జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: Virat Kohli: కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. బ్యాట్‌తో కొడతానని బెదిరించా! దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

ఇక, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు పూర్తి కాబోతోంది.. కరోనా సమయంలోనూ ఎక్కడా ఖాళీగా లేను అన్నారు బోడే ప్రసాద్.. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కరోనా సమయంలోనూ అందరికీ అందుబాటులో ఉన్నానని తెలిపారు.. ఇక్కడ అపార్టమెంట్‌లలో ఉన్న వారి సమాచారం సేకరించి.. దాదాపు 10 వేల మందితో మాట్లాడడం జరిగింది.. ఎన్నికల సమయంలో టీడీపీకి అండగా ఉండాలని కోరినట్టు పేర్కొన్నారు. కరోనా తర్వాత నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికీ ఉదయం, సాయత్రం ఇలా ట్‌ చేశాను.. ఉదయం 7 గంటలకే బయల్దేరి 10 గంటల వరకు.. ఆ తర్వాత కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఏడు, ఎనిమిది గంటల వరకు వీలైనంత ఎక్కువ మందిని కలిసే వాడనని గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో టీడీపీ పటిష్టతకు కష్టపడి పనిచేసినట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఇంతకన్న పెద్ద సంక్షోభం రాదని భావించాం.. ఆ సమయంలో స్వచ్ఛందంగా రాజమండ్రి జైలుకు వెళ్లి.. టీడీపీకి మద్దతుగా ఉంటాను అని.. పార్టీకి మద్దతు తెలియజేసి.. చంద్రబాబుకు ధైర్యం కలిగించిన ఏకైక వ్యక్తం పవన్‌ కల్యాణ్‌ అని కొనియాడారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ బోడే ప్రసాద్. ఆ సమయంలో ఇంకా బోడే ప్రసాద్‌ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి: TDP Leader Bode Prasad | Penamaluru | Ntv