NTV Telugu Site icon

Devineni Uma: దేవినేని ఉమాకు టీడీపీ కీలక బాధ్యతలు..

Devineni Uma

Devineni Uma

Devineni Uma: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. దేవినేని ఉమాకు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పచెప్పింది.. ఇప్పటికే ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఈ సారి ఎన్నికల్లో సీట్ల సద్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న దేవినేని ఉమాకు మొత్తంగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ.

Read Also: Health Tips : భోజనానికి ముందు వీటిని తాగితే త్వరగా బరువు తగ్గుతారు..

దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. ”తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సేవలు అందిస్తున్న దేవినేని ఉమామహేశ్వరావుకి అదనంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించడం జరిగింది.” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.. ఈ పరిణామాలతో తీవ్ర కసరత్తుచేసిన టీడీపీ అధినేత.. వసంత కృష్ణ ప్రసాద్‌ను మళ్లీ మైలవరం నుంచే బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చారు.. దీంతో, ఆ స్థానంపై పట్టున్న దేవినేని ఉమా.. అసంతృప్తికి లోనయ్యారు. ఇదే సమయంలో దేవినేనిని మరోస్థానం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతూ వచ్చింది. కానీ, చివరకు పార్టీలో దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Show comments