TDP-Janasena: వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన పార్టీలు.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అందులో భాగంగా ఈ రోజు టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశాన్ని విజయవాడలోని నోవాటెల్‌లో నిర్వహించారు..ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై కూడా సమాలోచనలు చేశారు.. ఉమ్మడి సభకు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. అయితే, సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో క్లారిటీ రానుందట..
Read Also: B.V. Raghavulu: మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమే..
ఇక, మేనిఫెస్టో రూపకల్పనపై కీలకాంశాల ప్రస్తావన జరిగినట్టుగా సమాచారం.. డ్వాక్రా రుణ మాఫీ హామీ అంశంపై కీలక చర్చ సాగగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.. వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టనునుంది టీడీపీ – జనసేన కూటమి. అయితే, వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను టీడీపీ – జనసేన సీరియస్‌గా తీసుకున్నాయి.. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దనే ఈసీ ఆదేశాలు ఉన్నాయని టీడీపీ – జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేశారు. ఈ రోజు జరిగిన సమావేశానికి టీడీపీ, జనసేన నుంచి కమిటీ సభ్యులు హాజరయ్యారు.