NTV Telugu Site icon

Janasena-TDP Meeting: టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారు

Tdp Janasena

Tdp Janasena

టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారు అయింది. ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో తెలుగు దేశం- జనసేన పార్టీలు తొలిసారి సమావేశం కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది.

Read Also: Scammers: ఏడాదిలో 1.02 ట్రిలియన్ డాలర్లను కొల్లగొట్టిన స్కామర్లు.. ఎక్కువగా ప్రభావితమైన దేశాలు ఇవే..

ఇక, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈ కమిటీలో చర్చించనున్నారు.
ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను టీడీపీ- జనసేన పార్టీలు ప్రకటించాయి. అయితే, ఈ కీలక సమావేశానికిక రాజమండ్రి వేదిక కానుంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న రాజమండ్రినే భేటీకి వేదికగా ఇరు పార్టీలు నిర్ణయించారు. రాజకీయ కార్యక్రమాల స్పీడు పెంచేలా టీడీపీ- జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.