NTV Telugu Site icon

BC Janardhan Reddy: నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ ప్రారంభం కావడం శుభపరిణామం

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

BC Janardhan Reddy: దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలకు కేంద్రమైన నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించడం శుభపరిణామమని అని బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ అన్నారు. ఇవాళ నరసరావుపేట పట్టణంలో మాజీ ఉపరాష్ట్రపతి కె. వెంకయ్యనాయుడితో కలిసి కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించిన బీసీ జనార్థన్ రెడ్డి… కే – రిడ్జ్ యాజమాన్యానికి, విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Read Also: Ambedkar Statue: భారీ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

నరసరావుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ ప్రారంభోత్సవంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వాలన చేసి, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు కరతాళధ్వనుల మధ్య కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను వెంకయ్యనాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ జనార్థన్ రెడ్డి ప్రసంగిస్తూ. .కే – రిడ్డ్ యజమాన్యానికి , విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పిల్లలకు మంచి ఆహ్లాదకరవాతావరణంలో సకల వసతులు ఉన్నప్పుడే అత్యుత్తమ విద్య అందుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారని.. ఆ దిశగా కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసరావుపేట అంటే గుర్తు వచ్చేది..విద్యాసంస్థలు..మా రాయలసీమ నుంచి కూడా ఇక్కడ చదువుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయ్యారని బీసీ జనార్థన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే, ధూళిపాల నరేంద్ర, జీ.వీ.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Show comments