Site icon NTV Telugu

TDP: జనసేనతో సమన్వయం కోసం టీడీపీ కో-ఆర్డినేషన్‌ కమిటీ

Tdp

Tdp

TDP-Janasena: టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు రెండూ కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే ప్రకటించారు. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేన అధినేత పవన్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరుపార్టీల మధ్య సమన్వయం కోసం జనసేన తరపున సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా జనసేన తరపున ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించారు.

Also Read: KA Paul: మా పార్టీ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ వాళ్లు కాపీ కొట్టారు..

తాజాగా టీడీపీ కూడా కమిటీని ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఐదుగురు సభ్యులతో కూడా కమిటీని అచ్చెన్నాయుడు ప్రకటించారు. కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యలకు టీడీపీ సమన్వయ కమిటీలో చోటు కల్పింది.

Exit mobile version