NTV Telugu Site icon

PM Modi: రేపు ఏపీకి ప్రధాని మోడీ.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు

Pm Modi

Pm Modi

భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరు కాబోతున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. ప్రధాని మోడీ రేపు (జూన్12) ఉదయం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయి.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు రానున్నారు.

Read Also: Kalki 2898 AD : కల్కి నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అదిరిపోయాయిగా..

ఇక, ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత.. తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. రేపు ఒడిషా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉండడంతో.. ఆ కార్యక్రమంలోనూ సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని పాల్గొనబోతున్నారు. ఒడిషాలో దాదాపు పాతికేళ్ల తర్వాత అధికారం చేతులు మారింది. దీంతో బీజేపీ తొలిసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Show comments