NTV Telugu Site icon

Chandrababu: చంద్రబాబుకు అస్వస్థత.. వైద్యుడిని జైలుకు పిలిపించిన అధికారులు

Chandrababu

Chandrababu

Chandrababu Arrest: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చర్మ సంబంధిత అస్వస్థతతో బాధపడుతున్నారు. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చర్మ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చర్మ వ్యాధి వైద్య నిపుణులను పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంటుకు లేఖ రాశారు.

Also Read: Botsa Satyanarayana: త్వరలో డీఎస్సీ.. మంత్రి బొత్స కీలక ప్రకటన

అత్యవసరంగా పంపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరును జీజీహెచ్ అధికారులు కేటాయించారు. దీంతో వైద్య బృందం జైలులోకి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును పరీక్షించింది. చంద్రబాబు విషయంలో జైలు అధికారులు నిరంతరం అలర్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Show comments