NTV Telugu Site icon

Chandrababu Helicopter: చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం..! రాంగ్‌ రూట్‌లోకి వెళ్లి..!

Babu

Babu

Chandrababu Helicopter: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌ ప్రయాణంలో కలకలం రేగింది.. సాంకేతిక కారణాలతో చంద్రబాబు హెలికాప్టర్ అరకు ప్రయాణంలో గందరగోళం ఏర్పడింది.. ఏటీసీ క్లియరెన్స్ లభించకపోవడంతో హెలికాప్టర్‌ను వెనక్కి రప్పించారు అధికారులు.. అయితే, చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ కు – ఏటీసీకి సమాచార లోపం ఏర్పడడంతో ఈ పరిస్థితి వచ్చింది.. నిర్దేశించిన మార్గం కాకుండా మరో మార్గంలో అరకుకు బయల్దేరి వెళ్లింది చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్.. అయితే, రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) హెచ్చరించింది.. దీంతో, హెలికాప్టర్‌ను వెనక్కి పిలిపించింది ఏటీసీ.. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు ఏటీసీ అధికారులు.

Read Also: Ajith Vs Vijay: క్లాష్ ఆఫ్ టైటాన్స్ కి కోలీవుడ్ సిద్ధం… కొంచెంలో మిస్ అయ్యింది

అయితే, ఏటీసీ అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత హెలికాప్టర్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు అరకు వెళ్లారు.. హెలికాప్టర్ దిగి కారులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి . ఈ బహిరంగ సభకు టీడీపీ, జనసేన నేయకులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కాగా, రా.. కదలిరా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ స ఈఎం జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అందులో భాగంగా నేడు అరకు, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రా.. కదలిరా’ సభలు నిర్వహించనున్నారు. అరకు, మండపేటల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా.. కదలి రా.. బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ నాయకత్వం.

Show comments