Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారు.. భారీ మెజార్టీ సాధిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారైంది.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను అన్నారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.. భారీ ర్యాలీగా వెళ్లి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రకటించారు.. పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆనుహ్యమైన ప్రజా స్పందనకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఓటింగ్ నాడు కూడా ఇదేవిధమైన ప్రజాస్పందన ఉంటుందన్నారు. భారీ ర్యాలీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. వారికి నా క్షమాపణలు అన్నారు. నా విజయం ఖరారు అయ్యింది.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను అని ధీమా వ్యక్తం చేశారు.. గుంటూరు పార్లమెంట్ ప్రజలకు కఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తాను అన్నారు. అవినీతికి తావు లేనీ రాజకీయాలు నేను చేస్తాను అని స్పష్టం చేశారు గుంటురు లోక్‌సభ టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.
Read Also: Uddhav Thackeray: మేము 300 సీట్లకు పైగా గెలుస్తాం.. నా పార్టీనే ఒరిజినల్..
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!