Pemmasani Chandrasekhar: గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు.. ఈ రోజు పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.. బడుగుబలహీన వర్గాల కన్నీటి చుక్కలను తూడ్చడానికి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నారు.. బీసీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతో చేస్తే.. వైసీపీ సర్కార్ మొండి చేయి ఇచ్చిందన్నారు.. ఏమైనా అంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని చెబుతున్నారంటూ దుయ్యబట్టారు.
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
ఇక, ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే.. ఎన్నికలు రేపు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉందన్నారు పెమ్మసాని.. మేం ఎన్నికల్లో గెలవడం పక్కా.. కేవలం మెజారిటీ లెక్క పెట్టుకోవడం కోసమే ఎన్నికలు అని అభివర్ణించారు.. మా ఫ్లెక్సీలను వైసీపీ నేతలు చించివేస్తున్నారు.. మీరంటే పులివెందుల పులి, సింహం అంటారే.. కానీ, మరి ఈ పిల్లి చేష్టలు ఏంటి? అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి పాల్గొన్న పెమ్మసాని.. ఈ రోజు పొన్నూరు నియోజకవర్గంలో పది గ్రామాల్లో ప్రచారం చేశామని తెలిపారు. చాలా గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది.. ఎవరిని చూసినా విక్టరీ సింబల్ చూపిస్తున్నారని తెలిపారు.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఓడించాలా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు పెమ్మసాని.. ఇక, రాత్రి పొన్నూరు నియోజకవర్గంలో పెమ్మసాని రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉత్సాహ పరిచారు పెమ్మసాని చంద్రశేఖర్.