TDP and YCP: ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఏజెంట్ల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు టీడీపీ ఏజెంట్లు వచ్చారు. తమకు మెజారిటీ వచ్చే రాళ్ళూరు ఈవీఎంల కౌంటింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పిచింది. ఇక, ఇరు పార్టీల ఏజెంట్లకు సర్దిచెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్వో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపణ చేస్తున్నారు.
Read Also: TTD: టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా
కాగా, వెంటనే ఆర్వోను సస్పెండ్ చేసి రీ కౌంటింగ్ నిర్వహించాలని టీడీపీ పార్టీకి చెందిన ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో దర్శి నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య పహారా కాస్తున్నారు.