YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎన్నికల సమయంలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.. ఐదో రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.. వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్న సీఎం జగన్.. వారి సమస్యలను అడిగితెలుసుకుంటున్నారు.. ఇదే సమయంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.. మరోవైపు.. ఇతర పార్టీలకు చెందిన నేతలకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు.
Read Also: Niranjan Reddy: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గం.. మంత్రి తుమ్మలపై నిరంజన్ రెడ్డి ఫైర్
మేమంతాసిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పలువురు టీడీపీ, జనసేన పార్టీ నుంచి ఈ రోజు వైసీపీలో చేరారు.. సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ నేత వేణుగోపాల్, జనసేన నియోజకవర్గ నేత తిరుపతేంద్ర, పుట్టపర్తి టీడీపీ మండల నేత కె పెద్దన్న, వెంకటస్వామి సహా పలువురు నేతలను సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వచ్చారు.. ఇక, పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి సహా మరికొందరు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉష శ్రీ చరణ్.. వైసీపీ అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు.
